BDK: కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు తండ్రి ఇవాళ మరణించారు. విషయం తెలుసుకున్న INTUC భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జలీల్, INTUC పాల్వంచ పట్టణ అధ్యక్ష్య, కార్యదర్శులు బాలు నాయక్, శనగ రామచందర్ రావు, వారి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు.