MBNR: జిల్లా వ్యాప్తంగా 06 మండలాలలో రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుంచి 11 గంటల వరకు దాదాపు 55 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చిన్నచింతకుంట, కౌకుంట్ల, హన్వాడ, మిడ్జిల్, కోయిలకొండ, దేవరకద్ర మండలాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.