GNTR: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నిబంధనలు సడలించాలని CPM పెదకాకాని మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. పెదకాకాని మండలం నంబూరులో ఆదివారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి రైతుల ధాన్యం కల్లాలను ఆయన పరిశీలించారు. ట్రాక్టర్లకు జీపీఎస్ నిబంధనను సడలించాలన్నారు. మారిన వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించి తేమశాతం పెంచాలన్నారు.