PLD: చిలకలూరిపేట మండలం వేలూరు పరిధిలో కోతముక్క ఆడుతున్న ఐదుగురిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై జి.అనిల్ కుమార్, పీఎస్ఐ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి నిందితుల వద్ద నుంచి రూ.15,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.