కామారెడ్డిలోని దేవునిపల్లిలో నిర్వహిస్తున్న మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాల్లో హుండీ ఆదాయం రూ. 91,378 సమకూరినట్లు గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. అగ్నిగుండాలు, కళ్యాణ కట్నాలు, దేవుని దండలు, హుండీ ఆదాయం, వేలంపాట, విరాళాలు అన్ని కలిపి సమకూరినట్లు వారు పేర్కొన్నారు. బుధవారం చక్ర తీర్థం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.