SRD: పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో 11వ బాలికల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జయలక్ష్మి బుధవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉదయం 10 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభిస్తారని చెప్పారు. కబడ్డీ, వాలీ బాల్, ఖోఖో, అథ్లెటిక్ పోటీల్లో 1190 మంది విద్యార్థులు పాల్గొంటారని వెల్లడించారు.