కృష్ణా: తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ సభ్యుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ పాల్గొని పార్టీ క్రమశిక్షణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.