AP: మహిళల వన్డే ప్రపంచ కప్లో రాణించిన క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ఆమెకు చెక్కును అందజేశారు. కడప జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే.