BDK: ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పాండురంగాపురం గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించడం తీవ్రంగా ఖండించ దగ్గ చర్య అని న్యాయవాది రమేష్ నాయక్ ఇవాళ కొత్తగూడెం సమావేశంలో పేర్కొన్నారు. గిరిజన ఓటర్లు ఉన్నప్పటికీ వారి ఓట్లను అక్రమంగా తొలగించి, ఎన్నికలు జరగకుండా అగ్రవర్ణాలకు చెందిన గిరిజనేతరులు కుట్రలు పన్నడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన విమర్శించారు.