MHBD: తొర్రూరు మండలం కిష్టాపురం పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మాధవి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన తన సమీప అభ్యర్థి గూడెల్లి కొమరమ్మపై 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె విజయంతో గ్రామంలో తన అనుచరులు విజయోత్సవాలు నిర్వహించారు. పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.