AP: ఉ.గుంటూరు జిల్లా మాచవరంలో దారుణం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్య మహాలక్ష్మిని గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని సంతమాగలూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న వీరికి ఇద్దరు సంతానం. ఇటీవల తరచూ గొడవలు అవుతుండగా విడిపోయారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆమె దగ్గరకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఉదయం హత్య చేశాడు.