ప్రకాశం: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులను ప్రతి నెలా వైద్యులు పరీక్షించాలని డీఆర్ఓ ఓబులేసు సూచించారు. ఒంగోలు మండలం అన్నవరప్పాడులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం-7ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించరాదని వసతి గృహం సిబ్బందికి సూచించారు.