JN: నర్మెట మండలం లోక్య తండ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు మౌనిక 41 ఓట్ల మెజార్టీతో ఆదివారం ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో గ్రామంలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది. ఫలితాలతో మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.