AP: కాగ్నిజెంట్‌కు విశాఖలో 22.19 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఒప్పందంలో స్వల్ప సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం కాగ్నిజెంట్ లక్ష్యాలను గడువులోపు చేరుకోకపోతే, ఏకపక్షంగా ఒప్పందం రద్దుచేయకూడదని, అందుకు కారణాలేంటో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని ఆ సంస్థ చేసిన వినతికి ప్రభుత్వం సమ్మతించింది.