WNP: రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.