MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయాన్ని BRS ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పిపి కరుణాకర్ దంపతులు, తదితరులున్నారు.