VSP: తెలుగుదండు ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలిలో ఆదివారం తెలుగుతల్లికి నీరాజనాలు సమర్పించి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. అధికార భాషాసంఘం ఏర్పాటు మాతృభాష రక్షణలో తొలి అడుగని అభినందించగా, స్వతంత్ర మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు.