ASR: ఉక్కుంపేట మండలం కొట్నా పల్లి క్వారీలో శనివారం రాత్రి బాంబుల మోత మోగింది. దీంతో గ్రామంలో టీవీలు ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గత 4నెలల క్రితం నుంచి క్వారీలో కార్యకలాపాలు నిర్వహించలేదు. ఆకస్మాత్తుగా నిన్న రాత్రి బాంబుల శబ్దాలకు గిరిజనులు ఉలిక్కిపడి ఇంటి బయటికి పరుగులు తీశారు. ఆదివారం గ్రామస్తులందరు వెళ్లి క్వారీకి ఇనుప కంచెను వేశారు.