»Deputy Chief Minister Bhatti Vikramamarka Is Ready To Allocate Any Amount Of Funds To Fight Drugs
Bhatti vikramamarka: డ్రగ్స్ కట్టడికి ఎన్ని నిధులు కేటాయించడానికైనా సిద్ధం
డ్రగ్స్ నిర్మూలనకోసం నార్కోటిక్ బ్యూరోకు ఎన్ని నిధులైన ఇస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నక్లెస్ రోడ్డులో డ్రగ్స్ నిర్మూలన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
Deputy Chief Minister Bhatti vikramamarka is ready to allocate any amount of funds to fight drugs
Bhatti vikramamarka: డ్రగ్స్ తీసుకోవడం అంటే విషం తీసుకోవడమే అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కపేర్కొన్నారు. ఈ మాధకద్రవ్యాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎక్కడి వరకైన వెళ్తుందని తెలిపారు. ఈ మేరకు నక్లెస్ రోడ్డు జలవిహారం వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా సంపాదించేందుకు కొంతమంది పిల్లలకు, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని పేర్కొన్నారు. తాత్కాలిక సంతోషాల కోసం యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజా లాంటి వాటిని రాష్ట్రంలోకి రాకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, దీన్ని కట్టడి చేయడానికి ఎన్ని నిధులైనా కేటాయించేందుకు తామ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిపై పోలీసు యంత్రంగం నిఘా ఉందని, ఈ కేసులో దొరికిన వారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి లేదని, వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రగ్స్ నిర్మూలన చేసే నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా ఇస్తామన్నారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి యువతను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో గ్రామాల తోడ్పాటు కూడా ఉండాలని, పల్లెలకు వస్తున్న కొత్తవారిపై నిఘా ఉంచాలన్నారు.