»Karnataka Karnataka Government Takes Key Decision On Use Of Artificial Colouring
Karnataka: కృత్రిమ రంగు వాడకంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్, ఫిష్ కబాబ్స్‌తో పాటు మరికొన్ని పదార్థాల తయారీకి కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
Karnataka: Karnataka Government takes key decision on use of artificial colouring
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్, ఫిష్ కబాబ్స్‌తో పాటు మరికొన్ని పదార్థాల తయారీకి కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోగ్య మంత్రి దినేష్ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. రూ.10 లక్షల జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలని పదార్థాల్లో కృత్రిమ ఫుడ్ కలర్స్‌ను వాడుతారు. రంగుల కోసం ఉపయోగించే రోడమైన-బి అనే రసాయనం క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతుంది. ఇలాంటి విష పదార్థాన్ని గోబీ మంచురియా, కాటన్ క్యాండీల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇటీవల కొన్ని ఫుడ్ సెంటర్లో వీటి నమూనాలు దొరకగా నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయాలు చేపట్టిన వాళ్లకి ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా వేయడంతో పాటు లైసెన్సు కూడా రద్దు చేశారు.