కర్నూలు నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రిటర్నింగ్ అధికారి, నగర కమిషనర్ పీ.విశ్వనాథ్ ఆదేశించారు. శనివారం ఆయన దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హైస్కూల్ వద్ద బీఎల్వోలు నిర్వహిస్తున్న ప్రత్యేక మ్యాపింగ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఓటర్ల వద్దకు BLO వచ్చినప్పుడు సహకరించి, అవసరమైన సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరారు.