MVV Satyanarayana: Case registered against former YCP MP
MVV Satyanarayana: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. హయగ్రీవ భూముల విషయంలో అతనిపై కేసు నమోదు చేశారు. అతనితో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 2010లో సీనియర్ సిటిజన్స్ హౌసింగ్ కోసం ఎండాడలో హయగ్రీవకు 12.51 ఎకరాలకు కేటాయించారు.
ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని మాజీ ఎంపీ ఎంవీవీపై హయగ్రీవ డెవలపర్ చిలుకూరి జగదీశ్ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనని బెదిరించారని, నకిలీ పత్రాలు సృష్టించారని, విలువైన భూములు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఎంవీవీపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై ఎంవీవీ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.