»Manish Sisodia Extension Of Judicial Custody In Delhi Liquor Policy Case
Manish Sisodia: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. అతని జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.
Manish Sisodia: Extension of judicial custody in Delhi liquor policy case
Manish Sisodia: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు షాక్ తగిలింది. అతని జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. నేటితో కస్టడీ ముగియడంతో ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అతను తిహార్ జైల్లో ఉన్నారు. సిసోడియాను ఈడీ అధికారులు వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు.
సీబీఐకి సంబంధించిన కేసులో సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 7న కోర్టు కస్టడీని 15 వరకు కోర్టు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు కస్టడీని పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగాయని ఇందులో ప్రధాన కుట్రదారు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపించింది. ఇందులో చాలామంది ఆప్ నేతల ప్రమేయం ఉందని తెలిపింది. అయితే, ఆరోపణలు నిరాధారమని ఆప్ పార్టీ పేర్కొంది. మద్యం పాలసీ కేసులో గత ఏడాది మార్చి 9న ఈడీ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీహార్ జైలులోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.