»Puri Jagannadh A Project Abandoned By Star Heroes Now In The Hands Of Teja Sajja
Puri Jagannadh: స్టార్ హీరోలు వదులుకున్న ప్రాజెక్ట్.. ఇఫ్పుడు తేజ సజ్జ చేతిలోకి?
ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు కోసం వాళ్లు ఎన్నో సంవత్సరాల తరబడి ప్లాన్ చేసి విజువలైజ్ చేస్తారు. అయితే పూరీ జగన్నాధ్ డ్రీమ్ ప్రాజెక్టు అయిన జన గణ మణ సినిమాను హనుమాన్ హీరోతో చేస్తున్నట్లు సమాచారం.
Puri Jagannadh: A project abandoned by star heroes.. Now in the hands of Teja Sajja?
Puri Jagannadh: ప్రతి దర్శకుడికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టు కోసం వాళ్లు ఎన్నో సంవత్సరాల తరబడి ప్లాన్ చేసి విజువలైజ్ చేస్తారు. కొంతమంది కల తొందరగా నెరవేరితో మరికొందరిది కాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు. అలాంటివారిలో పూరీ జగన్నాధ్ ఒకరు. ఈ దర్శకుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన’ని చాలా సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నాడు. బిజినెస్మెన్ సక్సెస్ తర్వాత మహేష్‌బాబు ఈ ప్రాజెక్ట్‌లో నటిస్తాడని అంతా అనుకున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు.
మహేష్‌బాబు తర్వాత వెంకటేష్‌తో పాటు ఇతర భాషల హీరోలకు కూడా చెప్పారు. చివరికి విజయ్ దేవరకొండకి కూడా చెప్పారు. ఇక.. విజయ్ తోనే జన గణ మన తెరకెక్కుతుందని అంతా అనుకున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించి.. దాని పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. కానీ లైగర్ పరాజయం తర్వాత విజయ్, పూరి ఈ సినిమా విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. తర్వాత విజయ్ వేరే ప్రాజెక్టులకు వెళ్లిపోయాడు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్‌తో కలిసి పని చేయడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు పరిశ్రమలో సంచలనం ఏమిటంటే.. పూరీ మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్టు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుున్నాడు. ఇటీవల సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మూవీ హీరో తేజ సజ్జతో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను చేయాలని అనుకుంటున్నాడట. మరి ఆటంకాలన్నీ ఛేదించి అంతిమంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా? లేదా? అనేది చూడాలి.