పిచ్చి పీక్స్ అనే పదం మన అనేక సందర్భాల్లో వింటాం. నిన్న ఆగష్టు 9న చాలా థియేటర్లలో ఇది కనిపించింది. సాధారణంగా సినిమా థియేటర్లలో అభిమానుల సందడి మామూలు విషయమే. కొంచెం ఉత్సాహం తో డాన్సులు వేస్తూ గోల చేయడం ఎప్పుడూ ఉండేదే. గత కొంతకాలంగా పాత సినిమాలు రి రిలీజ్ చేస్తున్నారు, అభిమానులు కూడా తమ పాత రోజులు నెమరువేసుకుంటూ వీటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 2000 తరువాత వారు ఇప్పుడు టీనేజ్ కుర్రకారు అయితే ఈ రి రిలీజ్ సినిమాలను ఫస్ట్ టైం థియేటర్లో ఫుల్ కిక్ తో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు
అయితే మురారి 4K సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ట్రెండ్ అంటే కలెక్షన్స్ అనుకునేరు… మహేష్ సినిమాకు అవి ఎలాగో బాగా వస్తాయన్న సంగతి తెలిసిందే. మురారి కి ఏ సినిమాకు జరగని విధంగా అభిమానులు థియేటర్లలో అక్షింతలు పంచుతూ .. పెళ్లి సాంగ్ రాగానే స్క్రీన్ పైకి విసిరారు. ఇక్కడ వరుకు బాగానే ఉంది. విజయవాడ అలంకార థియేటర్లో ఒక యువ జంట చందామామా పాట ప్రదర్శన సమయంలో పెళ్లి చేసుకున్నారు. అభిమానుల కేరింతల నడుమ అబ్బాయి అమ్మాయికి తాళి కట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. స్టేడియం లో ప్రపోస్ చేయడం, మాల్స్ లో ప్రపోజ్ చేయడం చూసాం ఇప్పటివరకు. థియేటర్లో పెళ్లి చేసుకుని కొత్త ట్రెండ్ సృష్టించారు
పెళ్లి చేసుకున్న అబ్బాయి అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్స్ కావడం విశేషం. మురారి 4K సుమారు 2. కోట్ల రూపాయిల అడ్వాన్స్ సేల్స్ తోనే వసూలు చేసింది. ఆదివారం వరుకు చాలా చోట్ల మంచి బుకింగ్స్ ఉన్నాయి. సుమారు 5 కోట్ల వరుకు వసూల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు