ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 10) కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్యంగా ఇటీవల జరిగిన వరదలకు సంబంధించిన దుర్భర పరిస్థితులను పరీక్షించి, పరిశీలించడానికి జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కన్నూర్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని 11 గంటలకు చేరుకుంటారు. వాయనాడ్ అనేది ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం, కానీ వరదల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కొన్ని ఊళ్ళు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ప్రాణ నష్టం , ఆస్థి నష్టం, పశువుల నష్టం తీవ్రంగా నమోదయ్యాయి. జనజీవన వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకునే అవకాశముంది.
ఈ పర్యటనలో, నరేంద్ర మోదీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి అవసరమైన సహాయ నిధులు, పునర్నిర్మాణ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. తొలుత వరదల వాళ్ళ నష్టం సంభవించిన ప్రాంతాలను ఎరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. పేదివేల నిరాశ్రయులు ఉన్న రిలీఫ్ క్యాంపును మోడీ సందర్శిస్తారు.
ప్రధాన మంత్రి వయనాడ్‌లో ఉండగా, స్థానిక ప్రజలతో సమావేశమై, వారికి నూతన ఆశలను, అభివృద్ధి అవకాశాలను అందించడానికి ప్రయత్నిస్తారు. వాయనాడ్‌లో ఈ పర్యటనపై కేరళ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.