Gam Gam Ganesha Movie Review: గం గం గణేశా మూవీ రివ్యూ
విజయ్ దేవరకొండ సోదరుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్ దేవరకొండి. ఆయన హీరోగా నటిస్తున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గం గం గణేశా ఈ రోజు థియేటర్లకు వచ్చింది. మరీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం గం గం.. గణేశా’ (Gam Gam Ganesha). క్రైమ్ కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథేంటంటే:
గణేశ్ (ఆనంద్ దేవరకొండ) ఓ అనాథ. తన స్నేహితుడి(ఇమ్మాన్యుయేల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఆ సమయంలో తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తాను శ్రుతి (నయన్ సారిక). తన దగ్గర డబ్బులేదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. దాంతో తానూ ధనవంతుడు కావాలనుకుంటాడు. ఓ నగల దుకాణంలో రూ.7 కోట్ల విలువైన వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ ఒప్పుకుంటాడు. అక్కడితో ఆగకుండా దాన్ని తానే అమ్మి ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోతాడు. ఈ క్రమంలో వజ్రాన్ని చెన్నై తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. దాంతో భయపడ్డ గణేష్ ఆ వజ్రాన్ని ఓ భారీ వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. ఆ విగ్రహాన్ని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కిషోర్‌రెడ్డి (రాజ్ అర్జున్) ఆర్డర్ చేయించుకుంటాడు.. దాన్ని కిరాయి రౌడీ రుద్ర (కృష్ణ చైతన్య) తీసుకొస్తుంటాడు. దాన్ని కిషోర్‌రెడ్డి ఊరికి తీసుకెళ్లకుండా తన ప్రత్యర్థి రాజకీయ నాయకుడు దగ్గరకు తీసుకెళ్తాడు. ఉన్న రాజావారిపల్లెకు వెళ్తుంది. ఆ విగ్రహం కథేంటి? అందులో వేసిన విగ్రహాన్ని గణేష్ ఎలా దక్కించుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఈ సినిమా ఆద్యాంతం భయం, అత్యాశ, కుట్రలపై సాగుతుంది. వీటికి మించి అవసరం మనిషినిన ఎంతకైనా తెగించేలా చేస్తుంది అనేది అద్భుతంగా చూపించారు. వీటికి కామెడీని జోడించి కథ నడిపించిన తీరు మెప్పించింది. ఇందులో చూపించిన పాయింట్ కొత్త కథ కాదు. కానీ చూపించిన తీరు మెప్పిస్తుంది. గణేశ్, అతడి లైఫ్ స్టైల్‌ను పరిచయం చేస్తూ కథను పరిచయం చేసే తీరు బాగుంది. అయితే లవ్ ట్రాక్ తరువాత అసలు పాయింట్‌కు రావడానికి కొంత టైమ్ పడుతుంది. ఇక గణేశ్‌కి డబ్బు సంపాదించాలన్న కసి పుడుతుందో అప్పటి నుంచి కథ మొదలౌతుంది. ఈ నేపథ్యంలో గణేశ్ కథ చూపిస్తూనే మరోవైపు కిషోర్‌రెడ్డి ప్రత్యేక వినాయకుడి విగ్రహాన్ని ముంబయి నుంచి తీసుకొచ్చే ప్లాట్‌ను సమాంతరంగా నడిపంచిన తీరు కూడా మెప్పిస్తుంది.
గణేశ్ వజ్రాన్ని వినాయకుడి తొండంలో పడేయడం, ఆ తరువాత విలన్ల ఎంట్రీతో కథ వేగంగా సాగుతుంది. ప్రత్యర్థి రాజకీయ నాయకుడి ఊరి నుంచి కిషోర్‌రెడ్డి ఆ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు రుద్ర, అతడి గ్యాంగ్ చేసే ప్రయత్నాలు.. వజ్రం కోసం గణేశ్, అతడి ఫ్రెండ్ వేసే ప్లాన్లు ఒక వైపు చాలా ఆసక్తిగా సాగుతాయి. ఇక మతి భ్రమించిన డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్‌గా వెన్నెల కిషోర్ పాత్ర చాలా నవ్వులు తెప్పిస్తుంది. అలా ఫన్నిగా సాగే కథలో లాస్ట్‌లో ట్విస్టు చాలా బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే:
ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో అలరించాడు. గణేశ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషన్ సన్నివేశాల్లో మంచి యాక్టింగ్ కనబరిచాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఫస్ట్ హాఫ్‌లో నయన్ సారిక, సెకండ్ హాఫ్‌లో ప్రగతి శ్రీవాస్తవ జస్ట్ టైమ్‌పాస్ అంతే. కిషోర్రెడ్డిగా రాజన్, రుద్రగా కృష్ణ చైతన్య తమ పాత్రల మేర నటించారు. ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ పాత్రలు చిత్రానికి ప్రధానబలం. సాంకేతిక అంశాలు కూడా మెప్పించాయి. చైతన్ భరద్వాజ్ పాటలు, ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ
ఆకట్టుకున్నాయి. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి ఎంచుకున్న కథ కొత్తది కానప్పటికీ చూపించిన తీరు మెప్పించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.