ఈశాన్య భారతదేశంలో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి అసోం, త్రిపుర రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. అసోంలోని మోరిగావ్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు కాగా, త్రిపురలోని గోమతిలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. అయితే, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.