NZB: విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని AMVI మధుకర్ అన్నారు. సోమవారం పిట్లంలో పాఠశాల బస్సులను ముమ్మరంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా బస్సులకు సంబంధించిన పత్రాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలతో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను పరిశీలించారు. ప్రతి పాఠశాల బస్సు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ కలిగి ఉండాలన్నారు.