NZB: రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న తరహాలోనే జిల్లాలోనూ ప్రజావాణి నిర్వహించేందుకు శ్రీకారం చుడుతామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆన్లైన్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. ఈ మేరకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సోమవారం ప్రజావాణిలో పాల్గొన్నారు. ఫిర్యాదులు స్వీకరించారు.