KMM: కాంగ్రెస్ వైఫల్య పాలనపై BRS పోరాటం మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని వారి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి పేరుతో తెలంగాణ ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ నీళ్ల కుట్ర చేస్తుందని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేది బీఆర్ఎసే అన్నారు.