GDWL: ప్రజలు ఎన్నో ఆశలతో తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.