అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన తొలి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 25 మండలాల నుంచి వచ్చిన 281 అర్జీలను స్వీకరించారు. అర్జీలకు సకాలంలో, నాణ్యతతో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు.