JGL: కోరుట్ల నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కలెక్టర్ సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. మెట్పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా కొత్త బోరింగ్లు మంజూరు చేయాలని, ‘మనఊరు– మనబడి’ నిధులను విడుదల చేయాలన్నారు.