మెట్రోరైలు ఫేజ్ -2 నిర్మాణ పనులపై హైకోర్టులో విచారణ జరిగింది. చారిత్రక నిర్మాణాలు దెబ్బతినేలా మెట్రో పనులు చేస్తున్నారంటూ పిల్ దాఖలైంది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగడం లేదని ఏఏజీ వాదనలు వినిపించారు. దీనిపై ఫిబ్రవరి 4న పాతబస్తీ మెట్రో పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.