MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు PHC వైద్యాధికారి నందన తెలిపారు. జిల్లా మెడికల్ కాలేజ్ నుంచి స్పెషలిస్ట్ వైద్యులు, జనరల్ ఫిజీషియన్, డెంటల్ ఆర్థోపెడిక్, గైనకాలజీ, పిల్లల వైద్య నిపుణులు, అస్తమాలజీ, కంటి వైద్య నిపుణులు హాజరై, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.