TG: హైదరాబాద్ అంబర్పేట్లోని రహత్నగర్లో పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 2,500 కేజీల కల్తీ పెరుగుతో పాటు.. పెరుగు తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు సీజ్ చేశారు. NR ఎంటర్ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా కల్తీ పెరుగు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.