PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గంగాపురిలో మహిళపై కోతుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో గడిపల్లి మంగ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మొన్న కూచిరాజు పల్లిలో ఒక వ్యక్తిని, నిన్న 9వ వార్డులో ఒక మహిళపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. రోజురోజుకు కోతుల దాడులు పెరుగుతున్నాయి.