ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరగడానికి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 38 పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు.