KMM: అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.