శివాజీ, అనసూయ ఎపిసోడ్లో మురళీ శర్మ అనే వ్యక్తి ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అనసూయ అభిమాని అని చెప్పుకుంటూ.. ఆమె పొట్టి బట్టలు వేసుకోవద్దని చెప్పడానికి మీరు ఎవరు అంటూ పలు డిబేట్లలో పాల్గొంటున్నారు. ఈ విషయంపై అనసూయ స్పందించింది. ఆయన ఎవరో తనకు తెలియదని స్పష్టం చేసింది. ఆయన మాటలను కూడా సమ్మతించనని చెప్పింది. తన పేరు వాడుకుని బతుకుతున్నారని విమర్శించారు.