టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కొందరికి కోహ్లీ పేరు ఎత్తకపోతే పూట గడవదు అన్నట్లుగా ఉంది పరిస్థితి’ అని SMలో పోస్టు పెట్టాడు. తాజాగా ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. కొందరు మాజీ ఆటగాళ్లు పనిగట్టుకొని కోహ్లీని విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు పెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.