పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు వీవీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ సంస్థలో 90 ఖాళీల భర్తీకి ఈనెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13న ఉ.10 గంటల నుంచి మ.1 గంట వరకు సర్టిఫికేట్ల జిరాక్స్‌లతో నూతన కలెక్టర్ భవనలో రూమ్ నెం. 233లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.