SRD: రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.