W.G: జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పి. మౌనిక ఎంపికయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీబీవైఎల్డీ (వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్స్–2026) కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా జరిగిన ఐడియా స్క్రీనింగ్‌లో రాష్ట్రం నుంచి ఎంపికైందని ప్రిన్సిపల్ తెలిపారు.