SDPT: ఎన్ని కుట్రలు చేసినా చివరికి గెలిచేది ధర్మమే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు సోమవారం కోట్టివేసిందన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా దేవుడు తనవైపే ఉన్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయంగా పగ సాధించాలని చూస్తోందనీ ఆరోపించారు.