న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడంపై మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. ‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో. నేను ధోనీతో కలిసి ఆడాను. వికెట్ కీపింగ్ కూడా చేయగలను అని రుతురాజ్ చెప్పాలి. జట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం’ అని BCCIపై విమర్శలు చేశాడు.