mdk: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో డ్రైనేజీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తోందని, దోమల వ్యాప్తి పెరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇంటి పన్నులు, నల్లా బిల్లుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ.. వార్డులో పరిశుభ్రత పనులపై చూపట్లేదని వాపోయారు.