BHPL: మొగుల్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన మూత రాకేష్ ఇవాళ అనారోగ్యానికి గురై.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ మృతుడి ఇంటికి వెళ్లి రాకేష్ పార్దివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట BJP నేతలు ఉన్నారు.