ఓ కొత్త పని మొదలుపెట్టేముందు మీకు భయంగా అనిపించొచ్చు. అంతమాత్రన మీకు ఆ పనిచేసే సామర్థ్యం లేదని కాదు. ఇంతకు ముందు మీరు అలాంటి ప్రయత్నం చేయలేదని మాత్రమే అర్థం. మీ మీద మీకు నమ్మకం కుదిరేవరకూ ఎదురుచూస్తూ కూర్చుంటే ఆ పని ఎప్పటికీ మొదలుపెట్టలేరు. కాబట్టి ధైర్యంతో ముందడుగు వేసి పనిచేసుకుంటూ పోతే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.